: రాష్ట్రపతి ఎన్నిక నామమాత్రమే: చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నిక నామమాత్రమేనని... ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఉంటే బాగుండేదని చెప్పారు. ఈ రోజు రామ్ నాథ్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆయనను ప్రతిపాదిస్తూ రెండో సెట్ పై చంద్రబాబు సంతకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంచి వ్యక్తి అయిన రామ్ నాథ్ ను తమ అభ్యర్థిగా ఎన్డీయే ఎంపిక చేసిందని అన్నారు. రామ్ నాథ్ గెలుపుకు టీడీపీ అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. రామ్ నాథ్ కు మద్దతు విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడానని తెలిపారు.