: బళ్లారిలో బీజేపీ దళిత నేతను చంపిన ప్రత్యర్థులు
కర్ణాటకలోని బళ్లారిలో నడి రోడ్డుపై బీజేపీ దళిత నేతను గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, పార్టీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్న బండి రమేష్ (35)ను రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్ వద్ద ప్రత్యర్థులు పదునైన మారణాయుధాలతో పొడిచి హత్య చేశారు. దాడి చేసిన వారికి, రమేష్ కూ మధ్య పాత కక్షలు ఉన్నాయని, అదే ఘటనకు కారణమని అనుమానిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రమేష్ కు నేరచరిత్ర కూడా ఉందని, అతనిపై పలు కేసులు విచారణ దశలో ఉన్నాయని, ఆయన మృతిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.