: రిషికేష్-భద్రీనాథ్ ల మధ్య భారీ పేలుడు... చార్ ధామ్ యాత్రకు ఆటంకం!


పవిత్ర పుణ్యక్షేత్రాలైన రిషికేష్-భద్రీనాథ్ ల మధ్య ఘాట్ రోడ్డుపై భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళుతున్న లారీలో పేలుడు చోటు చేసుకుంది. దీంతో, మంటలు వ్యాపించి మరిన్ని సిలిండర్లు పేలిపోయాయి. ఈ క్రమంలో, లారీ మొత్తం ధ్వంసమైంది. ఘాట్ రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, చార్ ధామ్ యాత్రకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

  • Loading...

More Telugu News