: 13 గంటలుగా సాగుతున్న సహాయక చర్యలు... బావిలోంచి వినిపిస్తున్న చిన్నారి ఏడుపు... రంగంలోకి దిగిన రోబో!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించే చర్యలు వేగవంతమయ్యాయి. 13 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఏపీలోని మంగళగిరి నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి నుంచి పాపకు ఆక్షిజన్ అందించే చర్యలు చేపట్టారు. నేలపై నుంచి తల్లిదండ్రులు పిలిస్తే పాప ఏడుస్తోంది. దీంతో సమాంతరంగా గొయ్యి తవ్వేందుకు ప్రయత్నించగా రాళ్లు పడడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రోబోటిక్ హ్యాండ్ సహాయం తీసుకుంటున్నారు.
40 అడుగుల లోతు నుంచి పాపను కొంచెం పైకి లాగిన రోబోటిక్ హ్యాండ్ పాపను బయటకు తేవడంలో మాత్రం విఫలమైంది. దీంతో అధికారులు కొచ్చి నుంచి ప్రత్యేక పరికరాలు తెప్పిస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా, మంత్రి మహేందర్ రెడ్డి అక్కడే ఉండి సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నారు.