: బోరుబావిలో పడ్డ ఆరేళ్ల చిన్నారి.. బయటకు తీయడానికి ప్రయత్నాలు!


వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలంలోని చెన్వెల్లి గ్రామంలో ఏడాదిన్నర పాప బోరు బావిలో పడింది. పొలం వద్ద ఆడుకుంటూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారిని రక్షించేందుకు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, 108 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య ఘటనా స్థలికి చేరుకున్నారు.

కాగా, వికారాబాద్ జిల్లా యాలాల మండలం బోరవల్లి గ్రామానికి చెందిన యాదయ్య, రేణుక దంపతులు బతుకుదెరువు నిమిత్తం గత ఏడాది చెన్వెల్లి గ్రామానికి వచ్చారు. భూస్వామి వద్ద పనిచేస్తూ, పొలం వద్దే నివాసముంటున్నారు. రోజూ మాదిరే యాదయ్య, రేణుక పొలం పనులు చేసుకుంటుండగా, రోడ్డున పక్కనే బోరు బావిలో ఈ చిన్నారి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన వారి పెద్ద కూతురు అక్షిత తన తల్లిదండ్రులకు చెప్పింది. 

  • Loading...

More Telugu News