: కుకునూర్ పల్లిలోని ఫాంహౌస్ కు శిరీష వెళ్లలేదు: వెస్ట్ జోన్ డీసీపీ


బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి ఆమె కుటుంబసభ్యులు పలు అనుమానాలు లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, కుకునూర్ పల్లిలోని ఫాంహౌస్ కు శిరీష వెళ్లిందన్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఆ రోజు రాత్రి 11.20 గంటలకు రాజీవ్ కారు ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్ కు మాత్రమే వెళ్లిందని, మళ్లీ 2.05 గంటలకు క్వార్టర్స్ నుంచి తిరిగి బయటకు వచ్చిందని చెప్పారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయని చెప్పారు. తెల్లవారుజామున 1.48 గంటలకు భర్త సతీష్ కు శిరీష షేర్ చేసిన లొకేషన్ ఎస్ఐ క్వార్టర్స్ దేనని, ఈ విషయాన్ని ఎయిర్ సెల్ అధికారులు కూడా ధ్రువీకరించారని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి, రాజీవ్, శ్రావణ్, శిరీష లకు ఫుడ్ సరఫరా చేసిన హోంగార్డు భిక్షపతిని విచారించామని చెప్పారు.

  • Loading...

More Telugu News