: బైక్ చక్రానికి చుట్టుకున్న చీర.. మహిళ మృతి
ఓ మహిళ బైక్ మీద వెళుతుండగా ఆమె చీర బైక్ చక్రానికి చుట్టుకోవడంతో ఆమె కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దలైపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె బైకు చక్రంపై పడిన తన చీరను గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఆమె గంగడేగవలస గ్రామానికి చెందిన అరసడ జయలక్ష్మి (29) గా గుర్తించారు. ఆమె తల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్రరక్తస్రావం అయిందని, దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు.