: తారస్థాయికి వివాదం... అప్పట్లో ‘కుంబ్లే సర్’ అంటూ చేసిన ట్వీట్‌ని తొలగించిన విరాట్ కోహ్లీ!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇటీవలే రాజీనామా చేసిన టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంబ్లేకు సంబంధించి తాను గతంలో చేసిన ఓ ట్వీట్‌ను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించాడు. గత ఏడాది జూన్ 23న టీమిండియా చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపికైన విషయం తెలిసిందే. ఆ సమయంలో విరాట్ కోహ్లీ... ‘చీఫ్ కోచ్‌గా ఎంపికైన కుంబ్లే సర్ కు తాను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా’నని ట్వీట్ చేశాడు. కుంబ్లే ఆధ్వర్యంలో భారత్ జట్టు మరిన్ని ఘన విజయాలు సాధిస్తుందని, మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఆ ట్వీట్‌ను కోహ్లీ డిలేట్ చేయడంతో దేశ వ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్‌గా మారింది.