: మహిళల కోసం ‘ఫేస్ బుక్’లో కొత్త టూల్.. ప్రొఫైల్ పిక్ ను ఇతరులు డౌన్ లోడ్ చేయలేరు!


ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’లో ఇకపై తమ ప్రొఫైల్ పిక్చర్ ను మహిళలు ధైర్యంగా పెట్టుకోవచ్చు. అంతకు ముందులా, ఎవరైనా తమ ఫొటోను డౌన్ లోడ్ చేసుకుంటారనో, మార్ఫింగ్ చేస్తారనో మహిళలు భయపడాల్సిన పని లేదని, వారి కోసం కొత్త టూల్ ను ప్రవేశపెడుతున్నామని సంస్థ ప్రొడక్ట్ మేనేజర్ ఆరతీ సోమన్ పేర్కొన్నారు.

మహిళల ప్రొఫైల్ పిక్ లను డౌన్ లోడ్ చేసేందుకు వీలు లేకుండా ఈ కొత్త టూల్ ‘ప్రొఫైల్ పిక్ గార్డ్’ ను రూపొందించామని చెప్పారు. దీని ద్వారా ఇతర వ్యక్తులు వారి ప్రొఫైల్ పిక్ ను డౌన్ లోడ్ చేయడం గానీ, షేర్ చేయడం గానీ, స్క్రీన్ షాట్ తీయడం గానీ, ఇతరులకు పంపించడం గానీ కుదరదని చెప్పారు. ఈ టూల్ ను వినియోగించే వారి ప్రొఫైల్ పిక్చర్ చుట్టూ నీలం రంగు బోర్డర్ కనిపిస్తుందని తెలిపారు. అదనపు డిజైన్ లేయర్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ప్రొఫైల్ పిక్చర్ ను ఇతరులు కాపీ చేసే అవకాశాలు చాలా మటుకు తగ్గుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News