: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ పేరు ఖరారు
రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ పేరును విపక్షాలు ప్రకటించాయి. ఈ రోజు సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, లోక్ సభ స్పీకర్ గా, కేంద్రమంత్రిగా మీరా కుమార్ సేవలందించారు. ఈ నెల 27న లేదా 28న ఆమె నామినేషన్ వేయనున్నారు. మీరాకుమార్ నామినేషన్ పై సంతకాల కార్యక్రమాన్ని విపక్షాలు ప్రారంభించాయి. కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ తో
మీరాకుమార్ తలపడనున్నారు.