: తెల్లడాక్టరే తన బిడ్డకు వైద్యం చేయాలంటూ ఓ మహిళ హల్ చల్!


జాతి వివక్ష మరోమారు బయటపడిన సంఘటన కెనడాలోని ఒంటారియోలో జరిగింది. తన కొడుక్కి వైద్యం చేసేందుకు తెల్లగా ఉండే వైద్యుడే కావాలని, గోధుమ రంగు వర్ణంలో ఉండే వైద్యులు చేసే ట్రీట్ మెంట్ అవసరం లేదంటూ ఓ మహిళ కేకలు వేస్తూ హల్ చల్ చేసింది. తెల్లగా ఉన్న వైద్యుడే తన బిడ్డకు సేవలందించాలని సదరు మహిళ అనడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

తమ ఆసుపత్రిలో ఉన్న పిల్లల వైద్యుడు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వెళ్లిపోతారని, మళ్లీ మరుసటిరోజే వస్తారని ఆసుపత్రి సిబ్బంది ఎంత చెప్పినా సదరు మహిళ పట్టించుకోకపోగా, నల్లజాతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో, అక్కడ ఉన్న నల్లజాతీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తెల్లగా ఉండే వైద్యుడు లభించని భయంకరమైన దేశంలోనా నేను నివసిస్తోంది?’, ‘నేను తెల్లగా ఉన్నాను కనుక మాపై గోధుమరంగు వాళ్లు...మీరందరూ మాపై దాడి చేస్తారు’ అంటూ ఆ మహిళ అరిచింది 

  • Loading...

More Telugu News