: పోటీ త‌ప్ప‌క‌పోతే ఎదుర్కునేందుకు సిద్ధం: న‌ంద్యాల ఉప ఎన్నిక గురించి అఖిల ప్రియ‌


నంద్యాల ఉప ఎన్నిక‌లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డే గెలుస్తార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... నంద్యాలలో త‌మ ప్ర‌భుత్వం చేస్తోన్న అభివృద్ధిని ప్రజలు మ‌రిచిపోలేరని చెప్పారు. టీడీపీలోకి వ‌చ్చిన త‌రువాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూమా నాగిరెడ్డి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారని అన్నారు. ప్ర‌తి వార్డులో తిరిగి క‌ష్టాల గురించి తెలుసుకున్నారని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక ఏక‌గ్రీవం కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ప్ర‌తిప‌క్ష పార్టీలు సానుకూలంగా స్పందిస్తాయ‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు. పోటీ త‌ప్ప‌క‌పోతే ఎదుర్కునేందుకు సిద్ధమ‌ని చెప్పారు. రూ.500 కోట్ల రూపాయ‌ల‌తో నంద్యాల అభివృద్ధి చెందుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News