: ఆ అశ్లీల పదాన్ని తొలగించండి... షారుక్ కొత్త సినిమా ట్రైలర్ పై ‘సెన్సార్’ బోర్డ్!


బాలీవుడ్ ప్రముఖ హీరో షారూక్ నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సేజల్’ చిత్రంలోని ఓ సంభాషణలో వినిపించే ‘ఇంటర్ కోర్స్’ అనే పదాన్ని తొలగించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చైర్ పర్సన్ పహలాజ్ నిహలానీ ఆదేశించారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం, ‘ఇంటర్ కోర్స్’ అనే పదాన్ని వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశామని, ఆ పదాన్ని తొలగించేందుకు చిత్ర బృందం అంగీకరించాకే ఈ సినిమా ట్రైలర్ కు ‘యూఏ’ సర్టిఫికెట్ ఇచ్చామని, కానీ, ఆ పదాన్ని తొలగించినట్టు చిత్ర బృందం తిరిగి తనకు చెప్పలేదని అన్నారు.

దీంతో, ‘జబ్ హ్యారీ మెట్ సేజల్’ ట్రైలర్ రిలీజ్ కు అనుమతించలేదని అన్నారు. కాగా, సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ చిత్రం రేపు విడుదల కానుంది. అదే రోజున, ‘జబ్ హ్యారీ మెట్ సేజల్’ చిత్రం ట్రైలర్ విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలో ప్రకటించింది. అయితే, ఆ చిత్రంలోని ఓ సన్నివేశంలో ‘ఇంటర్ కోర్స్’ అనే అభ్యంతరకరమైన పదాన్ని తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించడం గమనార్హం.‘జబ్ హ్యారీ మెట్ సేజల్’ కి సంబంధించి ఇప్పటికే మూడు మినీ ట్రైలర్స్ విడుదలయ్యాయి.

  • Loading...

More Telugu News