: అసెంబ్లీలో కళ్లు తిరిగి పడిపోయిన ఆప్ ఎమ్మెల్యేలు
పంజాబ్ శాసనసభలో ఈ రోజు అలజడి చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ తీరుకి నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ ఇన్సాఫ్ పార్టీల ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ ఆప్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా, ఎల్‌ఐపీ నేత సిమర్‌జీత్ సింగ్‌ను అసెంబ్లీలోనికి అనుమతించలేదు. దీంతో ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎక్కేశారు. దీంతో స్పీకర్ రానా కేపీ సింగ్ ఆప్ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా బలవంతంగా బయటికి పంపేశారు. ఈ క్రమంలో నలుగురు ఆప్ నేతలు కళ్లు తిరిగి పడిపోయారు.