: ఈ పని చేస్తే చాలు... ఏడాది పాటు షిరిడీలో మీకు వీఐపీ దర్శనం లభిస్తుంది!
షిరిడీ సాయినాథుని దర్శన సమయంలో క్యూలైన్లలో నిలుచుని విసిగిపోయిన భక్తులకు శుభవార్త. మీకు ఏడాది పాటు వీఐపీ దర్శనం కలిగించేందుకు షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ యాజమాన్యం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. షిరిడీ వెళ్లినవారు రక్తదానం చేస్తే చాలు... వారికి ఏడాది పాటు వీఐపీ హోదాలో దర్శనభాగ్యం కల్పిస్తారు. అంతేకాదు సత్రాల్లో బస విషయంలో కూడా వీఐపీ తరహాలోనే ట్రీట్ మెంట్ ఇస్తారు. ఈ విషయాన్ని ట్రస్ట్ ఛైర్మన్ సురేష్ హారే తెలిపారు. బ్లడ్ బ్యాంక్ హబ్ గా షిర్డీని తయారుచేయడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్టే... షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయాలని ఆయన విన్నవించారు. రక్తదానం చేసినవారికి ఒక మంచి పని చేశామన్న తృప్తి కూడా మిగులుతుందని అన్నారు.