: 'జన'భారతం: 2024 లో చైనాను మించిపోనున్న భారత్!
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే చైనా అని చెప్పేస్తాం. కానీ 2024 తరువాత ఇదే ప్రశ్న అడిగితే భారత్ అని సమాధానం చెప్పాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. ఆ సంవత్సరం నాటికి భారత్.. చైనా జనాభాను తప్పకుండా దాటిపోతుందని తెలుపుతూ యుఎన్‌కు చెందిన ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ ‘ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్: ది రివిజన్’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2030 నాటికి భారతదేశ జనాభా 150 కోట్లుగా ఉంటుంది. ప్రసుతం మనదేశ జనాభా 134 కోట్లుగా ఉంటే చైనా జనాభా 141 కోట్లుగా ఉంది.
ప్రతి ఏడాది ప్రపంచ జనాభా 8.3 కోట్ల చొప్పున పెరుగుతోంది. మరోవైపు 2050 నాటికి నైజీరియా జనాభా అమెరికాను దాటిపోనుంది. ఇదే సమయంలో మనదేశంలో 60 సంవత్సరాల వయసు పైబడినవారి సంఖ్య ఇప్పటికంటే రెట్టింపుగా ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో ఆ వయసు దాటిన వారు సుమారు 14 కోట్ల మంది ఉన్నారు.