: భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు: పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు


భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ సంచలన విజ్ఞప్తి చేశాడు. పాకిస్థాన్ క్రికెటర్లు భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల మద్దతు పెంచుకుంటారన్న సంగతి తెలిసిందే. గతంలో భారత్ కు వ్యతిరేకంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం వియ్యంకుడు జావెద్ మియాందాద్, రషీద్ లతీఫ్, సయీద్ అన్వర్, ఇంజమాముల్ హక్, షాహిద్ అఫ్రిదీ వంటి క్రికెటర్లు వ్యాఖ్యలు చేసి, అభిమానుల మద్దతు సంపాదించారు. యూనిస్ ఖాన్ వారందరికీ భిన్నంగా భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని కోరాడు. భారత్ పట్ల సోదరభావంతో మెలగాలని యూనిస్ ఖాన్ క్రికెటర్లు, అభిమానులకు సూచించాడు. అది ఆటతోపాటు జట్టుకు కూడా మేలు చేస్తుందని, విద్వేషం మంచిది కాదని సూచించాడు. 

  • Loading...

More Telugu News