: జగన్ కుల రాజకీయాలకు బ్రాహ్మణ సమాజం లొంగదు: శిరిపురపు శ్రీధర్


బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఐవైఆర్ కృష్ణారావు కోల్పోవడానికి మూలకారణం వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అని గుంటూరు జిల్లా బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ శిరిపురపు శ్రీధర్ అన్నారు. గత రెండేళ్లుగా ఐవైఆర్ పేరును కోన రఘుపతి దుర్వినియోగం చేశారని... ఐవైఆర్ పేరుతో బ్రాహ్మణులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. ఐవైఆర్ అంశాన్ని ఉపయోగించుకుని, వైసీపీ అధినేత జగన్ కుల రాజకీయాలకు తెర తీశారని... అది సరైనది కాదని చెప్పారు. జగన్ చేయాలనుకుంటున్న కుల రాజకీయాలకు బ్రాహ్మణ సమాజం లొంగదని అన్నారు. 

  • Loading...

More Telugu News