: క్వీన్ ఎలిజబెత్ భర్త ఫిలిప్ కు తీవ్ర అస్వస్థత
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్, 96 సంవత్సరాల ప్రిన్స్ ఫిలిప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శరీరంలోని పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకగా, ఫిలిప్ ను ఆసుపత్రిలో చేర్చినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. లండన్ లోని కింగ్ ఎడ్వర్డ్-6 ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోందని, ఆయన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఫిలిప్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
మంగళవారం నాడు, తన సతీమణితో కలసి రాయల్ అస్కాట్ లో జరుగుతున్న గుర్రపు పందాలను వీక్షించేందుకు వెళ్లిన వేళ, ఫిలిప్ అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో రాణి ఎలిజబెత్ 91వ పుట్టిన రోజును జరుపుకుని, కిరీటాన్ని అత్యధిక కాలం ధరించిన రాణిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.