: ఐవైఆర్ కృష్ణారావు వేల కోట్ల విలువైన భూములు కొన్నారు.. అమరావతిని కూడా అడ్డుకోబోయారు: రాయపాటి
రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయమని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ప్రభుత్వంలో కీలకమైన హోదాలో కొనసాగుతున్న ఐవైఆర్ వేరే పార్టీల అడుగుజాడల్లో నడుస్తున్నారని... ఏదో ఒక పార్టీలో చేరాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని అన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఐవైఆర్ కొన్నారని... ఈ కారణంగానే ఏపీ రాజధానిని దొనకొండలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాశారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు కూడా యత్నించారని మండిపడ్డారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు.