: అమరావతిలోని రోడ్లు, జంక్షన్లు, కార్యాలయాలు, స్టేడియంలు, కళా వేదికలు, ఉద్యానవనాలకు పేర్లు పెట్టే గొప్ప అవకాశం మీదే!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వడివడిగా తన రూపురేఖలను మార్చుకుంటోంది. త్వరలోనే రాజధాని నిర్మాణం ఊపందుకోనున్న దశలో... నగరంలోని పలు రోడ్లు, కూడళ్లు, ఉద్యానవనాలు, క్రీడా ప్రాంగణాలు, కళా వేదికలు, గెస్ట్ హౌస్ లు, కార్యాలయ భవనాలకు పేర్లను సూచించాల్సిందిగా ప్రజలను సీఆర్డీయే కోరింది.
రోడ్లు, కూడళ్లకు పెట్టే పేర్లు మన ఘన చరిత్రను ప్రతిబింబించేలా ఉండాలని సూచించింది. ఈ పేర్లు రాష్ట్రంలోని నదులు, పర్వతాలు, ప్రాశస్త్య ప్రదేశాలు, నైసర్గిక విశేషాలు, చారిత్రక ఘటనలు, రాజులు, రాజ వంశాలు, వివిధ రంగాల్లో కీర్తి గడించిన వ్యక్తులకు సంబంధించినవై ఉండాలని చెప్పింది. ఈ వివరాలను సీఆర్డీయే తన అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది. విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా తమ అభిప్రాయాలను ఈమెయిల్ ద్వారా తెలియజేవచ్చని తెలిపింది.