: మొబైల్ కంపెనీని ప్రారంభించనున్న చంద్రబాబు.. మరో ఐదు కంపెనీలకు భూమి పూజ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయ 10.45 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద 100 అడుగుల జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు 'సెల్ కాన్' కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.50 గంటలకు తాటిపర్తి సిరామిక్ క్లస్టర్ కు శంకుస్థాపన చేస్తారు. మొత్తం మీద ఐదు కంపెనీలకు ఆయన భూమి పూజ చేయనున్నారు.