: నా రాజకీయ జీవితం ఉన్నంత వరకూ సిరిసిల్లను విడవను: మంత్రి కేటీఆర్


రాజకీయ జీవితం ఉన్నంత వరకూ, సిరిసిల్లను విడిచి తాను వెళ్లడం జరగదని మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల అభివృద్ధిపై పుస్తకాన్ని ఈ రోజు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాజకీయ జీవితం ఉన్నంత వరకూ ఇక్కడి ప్రజలతోనే కలిసి ఉంటానని, చేనేత కార్మికులు గౌరవంగా బతికే ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే దసరా నాటికి నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ వర్షాకాలంలో మిడ్ మానేర్ రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని, ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News