: చంద్రబాబు, లోకేష్ పై విజయసాయిరెడ్డి ఆరోపణలు విడ్డూరం: బుద్దా వెంకన్న
భూ కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ల పాత్ర ఉందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. వారిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని, పదహారు నెలల పాటు జైల్లో ఉన్న విజయసాయి బరితెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు అంటే వైఎస్సార్పీసీ నేతలకు భయమెందుకో అర్థం కావడం లేదని అన్నారు.