: తన తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
'బాహుబలి-2' సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి చిన్న సినిమా తీస్తారని చాలా మంది భావించారు. ఈ నేపథ్యంలో, తన తదుపరి చిత్రం గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. చిన్న సినిమా తీయాలని తాను అనుకోవడం లేదని... అలాగే విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా తీయాలని కూడా తాను అనుకోవడం లేదని చెప్పారు. విజువల్స్ లేకుండా కూడా భారీ సినిమా తీయవచ్చని అన్నారు. తన తండ్రి ఇప్పటికే ఒక ఎమోషనల్ కథను సిద్ధం చేస్తున్నారని... స్క్రిప్ట్ పూర్తికాగానే దానికి తగ్గట్టు నటీనటులను ఎంపిక చేస్తామని చెప్పారు.