: కుక్క మాంసం ఫెస్టివల్: కుమ్మేస్తున్న చైనీయులు!
చైనాలో యూలిన్ నగరంలో ఎక్కడకెళ్లి చూసినా డాగ్ మీట్ డిష్లే దర్శనమిస్తున్నాయి. డాగ్ మీట్ ఫెస్టివల్ పేరిట కుక్క మాంసాన్ని వండుకుని లాగించేస్తున్నారు. కుక్క మాంసంతో ఎన్నో రకాల డిష్‌లు తయారు చేసి అమ్ముతున్నారు. డాంగ్కూ మార్కెట్లో డాగ్ మీట్‌ను కొనుక్కొని రుచి చూడడానికి ప్రజలు వస్తున్నారు. మరోపక్క, ఈ ఫెస్టివల్‌పై వ్యతిరేకత ఎదురవుతోంది. డాగ్ మీట్‌ను అమ్మకూడదని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఆ వేడుకను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ నిర్వాహకులు వినిపించుకోకుండా తమ పని కానిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.