: అమితాబ్ తీరును తప్పుబట్టిన కాంగ్రెస్ నేత!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తీరును కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తప్పుబట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమితాబ్ ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. జీఎస్టీతో తీరని నష్టం వాటిల్లుతుందని ఓ వైపు వ్యాపారులు మొత్తుకుంటుంటే.... జీఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. జీఎస్టీ బ్రాండ్ అంబాసడర్ గా అమితాబ్ తప్పుకోవాలని సూచించారు. లేకపోతే వ్యాపారవర్గాల వ్యతిరేకతను అమితాబ్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.