: జగన్ కు కోట్లాది రూపాయలు వారసత్వంగా వచ్చాయి: అయ్యన్న పాత్రుడు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వారసత్వంగా వైఎస్ఆర్ సంపాదించిన కోట్లాది రూపాయలు వచ్చాయని ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ... జగన్ మీడియాలో ప్రతిరోజు తప్పుడు వార్తలే కనపడుతాయని అన్నారు. విశాఖపట్నం భూముల గురించి వస్తోన్న ఆ వార్తలను అక్కడి ప్రజలు నమ్మి ఆందోళన చెందుతున్నారని అన్నారు. మేఘమథనం పేరుతో డబ్బులు తిన్నవారు నేడు అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. తమ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విశాఖపట్నం భూముల వ్యవహారంలో పారదర్శకంగా విచారణ జరిపిస్తోందని అన్నారు. ఆ భూముల వ్యవహారంలో ఆధారాలు ఉంటే తమ ముందు పెడితే వాటిపై చర్యలు తీసుకుంటామని అంతేకానీ, అసత్య ప్రచారం మాత్రం చేయకూడదని కోరారు.