: మొదటి సెట్ పై మోదీ, రెండో సెట్ పై చంద్రబాబు, మూడో సెట్ పై అమిత్ షాల సంతకాలు!
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా శుక్రవారం నాడు రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 23వ తేదీ ఉదయం 11 గంటలకు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను ప్రతిపాదిస్తూ తొలి సెట్ పై ప్రధాని మోదీ సంతకం చేయనున్నారు. రెండో సెట్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మూడో సెట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నాలుగో సెట్ పై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేయనున్నారు.