: సిరియాపై దాడులకు 'ఎఫ్-18 సూపర్ హర్నెట్' లను రంగంలోకి దింపనున్న ఆస్ట్రేలియా
సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై ఆస్ట్రేలియా మరోసారి విరుచుకుపడనుంది. తమ వద్ద ఉన్న అత్యాధునిక ఎఫ్/ఏ-18 ఎఫ్ సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తామని ఆస్ట్రేలియా రక్షణ విభాగం చీఫ్ మార్క్ బిన్ స్కిన్ తెలిపారు. కాగా, సిరియాలో ఇటీవల యూఎస్ యుద్ధ విమానాన్ని ఉగ్రవాదులు కూల్చివేసిన తరువాత, ఆస్రేలియా తమ దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఆరు యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితులపై ప్రస్తుతం సమీక్షిస్తున్నామని బిన్ స్కిన్ వెల్లడించారు. కాన్ బెర్రాలో మీడియాతో మాట్లాడిన ఆయన, తిరిగి ఉగ్ర స్థావరాలపై దాడులు కొనసాగించేందుకు ఎక్కువ సమయమేమీ పట్టబోదని అన్నారు.