: హైదరాబాదు బాచుపల్లిలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్
హైదరాబాదులో బాలికల మిస్సింగ్ కేసులు పెండింగ్ లో ఉండగానే, తాజాగా జరిగిన ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైదరాబాదులోని బాచుపల్లిలోని ఓ ప్లేస్కూల్ లో ఐదేళ్ల జనహిత చదువుతోంది. స్కూలుకు వెళ్లేందుకు ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి వ్యాన్ కోసం ఎదురు చూస్తుండగా.. వచ్చిన దుండగులు మరో కారులో ఆమెను ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ పరిసరాల్లోని సీసీ టీవీల పుటేజ్ పరిశీలిస్తున్నారు.