: బాబోయ్ కింగ్ కోబ్రా.... దీనిని చూస్తే హడలెత్తిపోవాల్సిందే... వీడియో చూడండి!


గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో పాములు కనిపించడం సర్వసాధారణం. వీటిలో చాలావరకు మనుషులకు హాని కలిగించనివే వుంటాయి. అరుదుగా మాత్రమే విష నాగులు కనిపిస్తుంటాయి. కానీ కింగ్ కోబ్రా గురించి వినడమే కానీ దానిని చూడడం అరుదనే చెప్పాలి. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా సైజు కూడా భయంకరంగా ఉంటుంది. అలాంటి భారీ కాయంతో కూడిన కింగ్ కోబ్రా మలేసియాలోని ఓ ఇంట్లో దూరింది. కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన కింగ్ కోబ్రా, అది మూసి ఉండడంతో ఎంతో అలవాటున్న దానిలా వెంటిలేటర్ గుండా ఆ ఇంట్లోకి ప్రవేశించింది. దీనిని వీడియో తీసిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News