: గుర్గావ్ లో దారుణం... ఢిల్లీ వీధుల సాక్షిగా సామూహిక అత్యాచారం!


నిర్భయ ఘటన జరిగిన అనంతరం పరిస్థితుల్లో మార్పు వస్తుందని బావించినవారి ఆశ అడియాసే అయింది. దేశరాజధాని ఢిల్లీ శివారులో మరోఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే...రాజస్థాన్‌ లోని భరత్‌ పూర్‌ కు చెందిన మహిళ (35) కుటుంబ సభ్యులను చూసేందుకు 15 రోజుల క్రితం గురుగ్రామ్‌ కు వచ్చింది. రాత్రి సమయంలో ఆమె తన ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుండగా స్విప్ట్‌ కారులో వచ్చిన దుండగులు ఆమెను కారులోకి లాగారు. ఢిల్లీ వీధుల గుండా కారును తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

 ఢిల్లీ పురవీధుల్లో కారును తిప్పుతూ ఐదు గంటలపాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది. అనంతరం సామూహిక అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించి, గ్రేటర్ నోయిడాలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను కారులోంచి బయటకు తోసేశారు. తెల్లవారుజామున బాధితురాలిని గుర్తించిన పోలీసులు, ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. 

  • Loading...

More Telugu News