: 10,000 షాపింగ్ చేయండి.. 60 కేజీల బంగారం గెలుచుకోండి!: జోయ్ అలుక్కాస్ బంపర్ ఆఫర్


ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయ్‌ అలుక్కాస్‌ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలో కేవలం 10,000 రూపాయల విలువైన బంగారు లేదా వజ్రాభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు 60 కేజీల బంగారం గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ ఆగస్టు 6 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం అమెరికా, బ్రిటన్, ఆసియా, గల్ఫ్‌ దేశాల్లోని వినియోగదారులకు మాత్రమేనని చెప్పింది. ఎవరైనా ఈ దేశాల్లోని జోయ్ అలుక్కాస్ కు చెందిన బంగారం షాపుల్లో కొనుగోలు చేయడం ద్వారా బహుమతి గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది.

 భారత్, మలేషియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఒమన్, అమెరికా దేశాల్లోని తమ స్టోర్స్‌ లో షాపింగ్‌ చేసిన లక్కీ షాపర్స్‌ 1 కేజీ బంగారం దాకా గెలుచుకునే అవకాశం కూడా కల్పించామని జోయ్ అలుక్కాస్ తెలిపింది. 10,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు డ్రాలో పాల్గొనేందుకు అర్హత పొందుతారని, పది వేల కొనుగోలుపై 1 రాఫిల్‌ కూపన్ అందిస్తామని చెప్పింది. అదే 10,000 రూపాయల విలువైన వజ్రాభరణాలు కొంటే మాత్రం వారికి 2 కూపన్ లు లభిస్తాయని జోయ్ అలుక్కాస్ తెలిపింది. 

  • Loading...

More Telugu News