: కాళేశ్వరం ఆలయ రాజగోపురంపై పిడుగుపాటు!


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయం రాజగోపురంపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు ఆలయ ప్రహరీ గోడ, ప్రాంగణంలోని సీసీ కెమెరాలు, విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు జరగకూడదని అన్నారు. పిడుగుపడిన సమయంలో భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు.

  • Loading...

More Telugu News