: ధోనీ, కోహ్లీ, యువీలకు థ్యాంక్స్: ఆకట్టుకుంటున్న పాక్ క్రికెటర్ ట్వీట్
టీమిండియా స్టార్ ఆటగాళ్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లకు థ్యాంక్స్ అంటూ పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ అజార్ అలీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా వారితో దిగిన పలు ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ముగ్గురు లెజండ్స్ తో తమ కుమారులు ఫోటోలు దిగారని, వారు ఫోటోలు దిగేందుకు సమయం కేటాయించినందుకు గానూ ఆయన ఇలా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ట్వీట్ కు టీమిండియా, పాకిస్థాన్ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.