: ‘డీజే’ సినిమా పాటలో ‘నమకం’, ‘చమకం’ పదాల తొలగింపు!


‘డీజే: దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ పాటలోని ‘నమకం’, ‘చమకం’ పదాలను తొలగించారు. ఆ పదాల స్థానే ‘నా గమకం’, ‘నీ సుముఖం’ అనే పదాలను చిత్ర బృందం పొందుపర్చింది. ఈ మేరకు సెన్సార్ బోర్డు నుంచి చిత్ర బృందం అనుమతి తీసుకుంది. కాగా, ఈ పాటలో అభ్యంతరకరంగా ఉన్న ఈ పదాలను తొలగించాలని కోరుతూ బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ వాటిని తొలగించేందుకు అంగీకరించడం తెలిసిందే. అయితే, మాట ఇచ్చిన ప్రకారం ఆ పదాలను తొలగించకపోవడంపై బ్రాహ్మణ సంఘాలు ఈ రోజు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు అనుమతి మేరకు ఆ పదాలను తొలగించడం జరిగింది.  

  • Loading...

More Telugu News