: భారత్ ఓడిపోయినందుకు టపాసులు పేల్చి పండుగ చేసుకున్నారు.. అరెస్టయ్యారు!


భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. భార‌త్ ఓడిపోయినందుకు పార్టీ చేసుకున్న 15 మంది భార‌తీయుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో పాక్ చేతిలో భార‌త్ ఓడిపోయినందుకు  15 మంది ముస్లిం యువ‌కులు పాక్ అనుకూల నినాదాలు చేశారు. టపాసులు కాల్చి పండ‌గ చేసుకున్నారు. దీంతో అదే ఊరికి చెందిన సుభాష్ అనే వ్య‌క్తి ఆ వ్య‌క్తులు తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ 15 మందిపై పోలీసులు ఐపీసీ 120 బీ, 124 ఏ (దేశ‌ద్రోహం) కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.  


  • Loading...

More Telugu News