: అక్రమంగా విద్యుత్ వాడుతున్నారు.. సోదాలకు వచ్చిన అధికారులను కర్రలతో తరిమి కొట్టారు!
హర్యానాలోని అంబాలాలో కొందరు అక్రమంగా విద్యుత్ వాడుతున్నారని సమాచారం రావడంతో సంబంధిత అధికారులు, పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలకు వెళ్లారు. విద్యుత్ తీగలకు వైర్లు తగిలించి అక్కడి వారు విద్యుత్ చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే, అదే సమయంలో స్థానికులంతా కలిసి ఒక్కసారిగా అధికారులు, పోలీసులపై దాడికి యత్నించారు. కర్రలు, రాళ్లతో వారి వెంటపడి తరిమి కొట్టారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసి రెచ్చిపోయారు. మా వద్దకే సోదాలకు వస్తారా? అంటూ తమకు చిక్కిన అధికారులను చితక్కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసు అధికారులు ఉన్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని చెప్పారు.