: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపై సానియా ట్వీట్


ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భార‌త్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై స్పందించిన భార‌త‌ టెన్నిస్ స్టార్, పాక్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ భార్య‌ సానియా మీర్జా  ట్వీట్ చేస్తూ... ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయింది.. అదే రోజు హాకీలో ఇండియా చేతిలో పాక్ ఓడిపోయింది. భార‌త్‌ క్రికెట్‌లో ఓడి హాకీలో గెలిచింది' అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంది. 'కంగ్రాట్స్ ఇండియా, కంగ్రాట్స్ పాకిస్థాన్' అని పేర్కొంటూ స్పోర్ట్స్ లెక్క స‌మం అయింద‌ని ఆమె చెప్పింది. సానియా చేసిన ఈ ట్వీట్‌పై అభిమానులు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News