: రోడ్డుపై దారి ఇవ్వట్లేదని కారులోంచి దిగాడు... యువతిని బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు!
ఓ యువతిని ఓ యువకుడు బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపిన ఘటన వర్జీనియాలో చోటు చేసుకుంది. రంజాన్ మాసం సందర్భంగా నబ్రా హస్సానెన్(17) అనే అమ్మాయి తన స్నేహితులతో కలిసి సైకిళ్లపై తెల్లవారు జామున ప్రార్థనలకు వెళ్లి వస్తోంది. ఆమె ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్వద్దకు రాగానే అదే సమయంలో ఎదురుగా డార్విన్ మార్టినెజ్ టోర్స్ (22) అనే యువకుడు కారులో వస్తున్నాడు. ఆ బాలికలు పక్కకు తప్పుకోవాలని హారన్ కొట్టాడు.
వారు తొందరగా జరగకపోవడంతో కోపంతో ఊగిపోయి బేస్ బాల్ బ్యాట్‌తో బెదిరిస్తూ వారి వెంట పడ్డాడు. ఆ క్రమంలో ఆ బ్యాట్ నబ్రాకు బలంగా తాకింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆ యువకుడు ఆమె మృతదేహాన్ని ఓ మడుగులో పడేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఆమె స్నేహితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.