: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ


బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు చేశారని ఆరోపిస్తూ ఆయనపై వేటు వేసింది. కాగా, ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్ పోస్టులపై ప్రభుత్వం తనను వివరణ కోరలేదని చెప్పారు. చాలా అంశాలపై తాను పోస్టులు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కృష్ణారావు ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News