: ‘డీజే’లో సభ్యసమాజం అనే పదాన్ని చాలాసార్లు వాడాం: హీరో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘డీజే’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆ సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ రోజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాల్లో తనదైన శైలిలో వదిలే డైలాగులు ఈ సినిమాలోనూ ఉంటాయని అన్నాడు. సభ్యసమాజం అనే పదాన్ని చాలాసార్లు వాడామని చెప్పాడు. అదే పదాన్ని పలు వేరు వేరు డైలాగుల్లో ఉపయోగించినట్లు తెలిపాడు. డీజే సినిమా యూనిట్ విడుదల చేసిన ట్రైలర్‌లలో ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ సభ్యసమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నట్లు, ఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అనే డైలాగుల్లో ఆ పదాన్ని వాడినట్లు చెప్పాడు.