: డార్జిలింగ్ లో విషమిస్తున్న పరిస్థితి... రోడ్డుపైకి లారీని తెచ్చాడని డ్రైవర్ కు నిప్పంటించిన నిరసనకారులు


ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ, గూర్ఖా జన్ ముక్తి మోర్చా నేతృత్వంలో 12 రోజుల క్రితం మొదలైన నిరసనలు నేడు తీవ్ర రూపం దాల్చాయి. ట్రక్కు డ్రైవర్ ఛత్రి, తన వాహనాన్ని సిక్కింకు తీసుకెళ్లే నిమిత్తం రోడ్డుపైకి తీసుకురాగా, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నిరసనకారులు, డ్రైవర్ తో సహా ట్రక్కును దగ్ధం చేశారు. ఈ ప్రమాదంలో 70 శాతం కాలిన గాయాలతో డ్రైవర్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఛత్రిని ఆసుపత్రిలో పరామర్శించిన టూరిజం మంత్రి గౌతమ్ దేవ్, ఈ ఘటన అత్యంత ఘోరమని వ్యాఖ్యానించారు.

 ఇక వీరి నిరసనలతో టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాంగ్ టక్ నుంచి సిలిగురి బయలుదేరిన టూరిస్టులను నిరసనకారులు అడ్డుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సులు దాదాపు 12 గంటలుగా రోడ్లపైనే ఆగిపోయాయి. కలిజోహ్రాకు 45 కిలోమీటర్ల దూరంలో రాంగ్ పో సమీపంలో ఆగిన టూరిస్టులను సిలిగురికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. పోలీసు భద్రతతో వీరిని తరలిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News