: హాట్ యాంకర్ అనసూయ, నటుడు అడవి శేష్ ను అవమానించిన ఫిలింఫేర్!
ఫిలింఫేర్ అవార్డుల చుట్టూ ఎన్నో ఆరోపణలు ఉన్నా... వాటికున్న క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు సినీ అభిమానులు చాలా ఆసక్తి చూపుతారు. అయితే, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఫిలింఫేర్ వేడుకల సందర్భంగా హాట్ యాంకర్ అనసూయ, నటుడు అడవి శేష్ కు అవమానం జరిగిందట. 'క్షణం' సినిమాకు గాను వీరిద్దరికీ ఫిలింఫేర్ నామినేషన్లు దక్కాయి. అయినప్పటికీ వీరిని వేడుకకు ఆహ్వానించలేదట నిర్వాహకులు. ఈ అంశంపై అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. వేడుకలకు సరిగ్గా గంట ముందు ఫోన్ చేసిన నిర్వాహకులు క్షమాపణలు చెప్పారని తెలిపాడు. మరోవైపు, అనసూయకైతే ఇంతవరకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదట.