: నా మాట విని 20 కిలోల బరువు తగ్గిన అమిత్ షా: బాబా రాందేవ్


తాను చెప్పిన సూచనలను పాటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 20 కిలోల బరువు తగ్గారని, ఆయన బరువు తగ్గడానికి యోగా ఎంతో సహకరించిందని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్ లో మంగళవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, యోగాను క్రీడాంశంగా పరిగణించాలని, యోగా ఆటకాదని చెప్పే వాళ్ల మాటలను పట్టించుకోనక్కర్లేదని అన్నారు. ఒలింపిక్స్ లో యోగాను క్రీడాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఓ దళిత నేత రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి ఎన్నికకు ప్రకటించి, ఎన్డీయే ప్రభుత్వం మంచి నిర్ణయాన్ని తీసుకుందని కొనియాడారు.

  • Loading...

More Telugu News