: టీవీ సీరియల్ లో టీడీపీ ఎమ్మెల్యే!
రాజోలు టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ముఖానికి రంగు వేసుకున్నారు. అసెంబ్లీలో తనదైన శైలిలో మాట్లాడే సూర్యారావు... ఇప్పుడు సీరియల్ కోసం డైలాగ్స్ చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, అంబేద్కర్ జీవిత చరిత్రను 100 ఎపిసోడ్లుగా సీరియల్ ను నిర్మిస్తున్నారు. ఈ సీరియల్ లో లాలాలజపతిరాయ్ పాత్రను సూర్యారావు పోషిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు, ఆయన ఎదుర్కొన్న కష్టనష్టాలను ఈ సీరియల్ లో చూపించనున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో అంబేద్కర్, లజపతిరాయ్ ల మధ్య జరిగే డిబేట్ లో సూర్యారావు నటిస్తున్నారు. తెనాలిలో నిన్న ఈ సీరియల్ నిర్మాణం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికసాయంతో ఈ సీరియల్ ను నిర్మిస్తున్నారు.