: 'దళిత' అస్త్రం తీస్తున్న కాంగ్రెస్... తెరపైకి షిండే లేదా మీరాకుమార్!


ఓ దళిత వ్యక్తిని రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ప్రకటించి, విపక్షాల నోరు నొక్కాలని బీజేపీ వేసిన ఎత్తుకు కాంగ్రెస్ పైఎత్తు వేయనుంది. బీజేపీలానే, మరో దళితనేతను అదే పదవికి పోటీలోకి దింపాలని, బీజేపీ ఎంపిక చేసుకున్నట్టుగా పెద్దగా పరిచయం లేని వ్యక్తిని కాకుండా, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దళిత నేతను బరిలోకి పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కేంద్ర హో శాఖ మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే, లోక్‌ సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ లలో ఒకరిని విపక్షాల తరఫున పోటీకి దింపాలని భావిస్తోంది. దీనిపై 22వ తేదీన అన్ని మిత్ర పక్షాలతో చర్చించి, తుది నిర్ణయం వెలువరించే ఆలోచనలో ఉన్నట్టు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. షిండే పేరును ప్రకటిస్తే, మహారాష్ట్ర నేత కాబట్టి శివసేన నుంచి మద్దతు పొందడంతో పాటు, ఎన్డీయేలో చీలిక తేవచ్చన్నది కూడా కాంగ్రెస్ అభిమతంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News