: భారత్ ఓడిపోవడానికి కారణమిదే: చాముండేశ్వరీనాథ్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యమే టీమిండియా కొంపముంచిందని హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ అభిప్రాయపడ్డారు. వరుసగా వికెట్లు కోల్పోవడం భారత్ ను దెబ్బతీసిందని చెప్పారు. అత్యంత కీలకమైన వికెట్లను తక్కువ సమయంలోనే కోల్పోవడంతో, పాకిస్థాన్ కు విజయం సులువైందని అన్నారు. పాక్ పేస్ బౌలర్ అమీర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబిచ్చారు. ఈ రోజు ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తో కలసి తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, టీమిండియా ఓటమిపై తన అభిప్రాయాన్ని తెలిపారు.