: బీజేపీకి మళ్లీ ఝలక్ ఇవ్వనున్న శివసేన?


ఎన్డీయే తరపున రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రామ్ నాథ్ కు మద్దతు తెలిపేందుకు విపక్షాలు సిద్ధంగా లేవు. ఈ క్రమంలో, విపక్షాలన్నీ కలసి తమ తరపున దళిత సామాజికవర్గానికే చెందిన మరో వ్యక్తిని రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రామ్ నాథ్ కు తాము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని... రాష్ట్రపతి ఎన్నికలో పోటీ తప్పదంటూ సీపీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

మరోవైపు బీజేపీకి దాని మిత్రపక్షమైన శివసేన కూడా షాక్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కేవలం దళిత ఓట్లను దండుకునే ఉద్దేశంతోనే రామ్ నాథ్ ను ఎంపిక చేసినట్టైతే, తాము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని శివసేన ప్రకటించింది. ఈ రోజు (మంగళవారం) తన అభిప్రాయాన్ని శివసేన స్పష్టం చేయనుంది. ఈ నేపథ్యంలో, బీజేపీ నేతలు కొంతమేర కలవరపాటుకు గురవుతున్నారు.  

  • Loading...

More Telugu News